సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పండగల సమయంలో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరిని ఆఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. కానీ కోవిడ్ -19 మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఆన్, ఆఫ్ సీజన్ సెంటిమెంట్‌లతో సంబంధం లేకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 2022 మొదటి వారంలోనే థియేటర్లు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” ఫిబ్రవరి 4న వస్తుంది. మొదట్లో చిరుకి సోలో రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా స్టార్ హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. సూర్య తన నెక్స్ట్ మూవీతో, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ స్పోర్ట్స్ డ్రామాతో చిరుకి పోటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం “ఎతర్క్కుం తునింధవన్” పనుల్లో బిజీగా ఉన్నాడు. నవంబర్‌లో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ధృవీకరించారు. మరోవైపు తాప్సీ పన్ను తన రాబోయే చిత్రం “శభాష్ మిథు” కోసం అదే రోజున బాలీవుడ్‌లో విడుదల స్లాట్‌ను బుక్ చేసుకుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Read Also : యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది. ఇక “శభాష్ మిథు”ను కూడా తెలుగులో డబ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మిథాలీ రాజ్ హైదరాబాద్‌కు చెందినది. పైగా క్రికెట్ ప్రియులంతా ఆమె బయోపిక్ కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇంకా తాప్సీ దక్షిణాదిలో ఓ ప్రముఖ హీరోయిన్. మరి ఈ సినిమాల నిర్మాతలు “ఆచార్య”తో కలిసి తమ తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వెళతారా? లేదా తరువాత తేదీకి వాయిదా వేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే “ఆచార్య” మెగా మల్టీస్టారర్… మెగాస్టార్ కు ఆయన తయుడికి సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ 40 నిముషాలు కనిపించబోతున్నాడు. “ఆచార్య” గురించి ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.