ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు.
నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత జూ. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్ ఆ పై అల్లు అర్జున్ వరుసగా తమ వంతు సాయంగా ఒక్కొక్కరు రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. గతాన్ని పరిశీలిస్తే ఇలా ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. ఒకరు ప్రకటించిన మొత్తానికి ఎక్కువగా కానీ, తక్కువగా కానీ ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడే ఆశ్చర్యంగా అందరూ సమానమైన మొత్తాలను విరాళంగా ప్రకటించారు.
ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేక వీరందరూ సమష్టిగా అనుకుని ప్లాన్ చేసుకుని ప్రకటించారా? అన్నది తెలియటం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్తం టిక్కెట్ రేట్లు పెంచకూడదు, బెనిఫిట్ షోలను ప్రదర్శంచరాదని ఇటీవల ప్రవేశ పెట్టిన జీవో మాత్రం బడా స్టార్స్ కు, వారి సినిమా సినిమాలను కొని ప్రదర్శించే వారికి శరాఘాతం అని చెప్పాలి. దీని వల్ల తాజాగా విడుదలైన ‘అఖండ’తో పాటు రాబోయే భారీ సినిమాలకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. సినిమాలన్నింటికి ఒకే రేటు అన్నట్లు ఇప్పుడు సినిమా ప్రముఖులు కూడా ఒకే మొత్తాన్ని విరాళంగా ప్రకటించటం కోఇన్సిడెన్స్ గా భావించలేము. ఇప్పటికే తమ వైయస్ ఆర్ సిపి కి టాలీవుడ్ దూరంగా ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటుందా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.