మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “ఆర్సీ 15”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్‌ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీకరించిన టీం నవంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అయితే తాజాగా ఒక ఆంగ్ల మీడియా పోర్టల్‌తో మాట్లాడిన రామ్ చరణ్ సినిమా విడుదల తేదీ ప్లాన్స్ ను రివీల్ చేశారు.
Read Also : ‘రాధే శ్యామ్’ హిందీ ఫస్ట్ సింగిల్… విజువల్ ఫీస్ట్ గా ‘ఆషికి ఆ గయీ’
మెగా హీరో శంకర్‌తో కలిసి పని చేసే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని, శంకర్ వంటి దర్శకుడితో పని చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన కొన్ని ఫ్యాన్ బాయ్ క్షణాలను ఆనందించానని చెప్పాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ “ఆర్సీ 15 అనేది పొలిటికల్ డ్రామా. శంకర్ సర్ స్క్రిప్ట్, విజన్, ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక వ్యక్తిగా, నటుడిగా నాకు ఆనందకరమైన అనుభవం. ఫిబ్రవరి 2023లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని చరణ్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్ గురించి చరణ్ మాట్లాడుతూ నటుడిగా కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఈ చిత్రం తనకు సహాయపడిందని చెప్పాడు. “నేను ఆర్ఆర్ఆర్ లో మూడు విభిన్న షేడ్ లతో కూడిన పాత్రను పోషిస్తున్నాను. అనేక రూపాల్లో నటించాను. రాజమౌళితో కలిసి పని చేయడం నేర్చుకోవడానికి, నటుడిగా ఎదగడానికి మరింత సహాయ పడుతుంది” అని అన్నారు. ఇక తాజాగా చరణ్ కు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.