Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
- 17ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
- స్నానం చేస్తుండగా ఫొటోలు.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
- నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని జుంజునులో 17ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మైనర్ బాలిక స్నానం చేస్తుండగా నిందితుడు వీడియోలు, ఫొటోలు తీసిన తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేశాడు. ఇప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది. ఈ సంఘటన మూడున్నరేళ్ల క్రితం డిసెంబర్ 2020లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు సాహిరామ్ మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ భయంతో బాలిక మౌనంగా ఉండడంతో నిందితుడు పలుమార్లు అత్యాచారం చేశాడు.
READ MORE: Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ కేసు జుంజునులోని గుధగౌడ్జి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. నిందితుడు సహిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ వివరణ ప్రకారం.. కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లగా.. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి 17 ఏళ్ల బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నేను స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలు తీశానని నిందితుడు బాలికతో చెప్పాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. ఈ వీడియోలను వైరల్ చేస్తానని బాలికను బెదిరించాడు. పలు మార్లు బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకుగుధగౌడ్జి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
READ MORE:Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు
బాధితురాలి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ హాజరయ్యారు. ప్రాసిక్యూటర్ 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 47 పత్రాలను కోర్టులో సమర్పించారు. సుమారు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు సాగిన విచారణ తర్వాత, పోక్సో కోర్టు నిందితుడు సహిరామ్‌కు పోక్సో చట్టం కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 50,000 జరిమానా విధించింది. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా కూడా విధించారు.
తాజావార్తలు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ఇంట్రో సీన్‌పై క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!