Rescue Operation: రాజస్థాన్ రాష్ట్రములోని బుధవారం సాయంత్రం దౌసా జిల్లాలోని బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ఓపెన్ బోర్‌వెల్ లో పడిపోయింది. ఇక అది గుర్తించిన ఇంటి సభ్యులు విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే దౌసా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రంజితా శర్మ, నీటి సరఫరా విభాగం అధికారులు, స్థానిక యంత్రాంగం అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం అప్పుడే.. ఆ లోపల రిటెన్షన్ ప్లేయర్‌ల వివరాలు..
ఈ సహాయక చర్యలలో భాగంగా SDRF, NDRF లలోని అనుభవజ్ఞులైన బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు దౌసా ఎస్పీ రంజితా శర్మ తెలిపారు. బాలిక ఇప్పటికే 5 గంటలకు పైగా బోర్‌వెల్‌లో చిక్కుకుపోయిందని, వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని.. మేము ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొన్న SDRF, NDRF బృందాలను పిలిపించామని ఆయన తెలిపారు. ఇకపోతే బాలిక రెస్క్యూ ఆపరేషన్ వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో బాలిక కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#WATCH दौसा, राजस्थान: ढाई साल की बच्ची बोरवेल में गिर गई, रेस्क्यू ऑपरेशन जारी है।
"बच्ची 35 फीट की गहराई में है। सबसे पहले बच्ची को ऑक्सीजन मुहैया कराया गया है। बच्ची अभी स्थिर है, जीवित है। जल्द ही बच्ची को बाहर निकाला जाएगा": ASP दौसा, लोकेश सोनवाल pic.twitter.com/HU8tj6lngh
— ANI_HindiNews (@AHindinews) September 19, 2024