Bagoriya Mataji Temple: అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయం గురించి ఈ రోజు మనం చూద్దాం. ఇందులో భాగంగా.. ఒకగుడిలో హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా అమ్మవారిని పూజిస్తారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని భోపాల్‌ఘర్ ప్రాంతంలోని బగోరియా గ్రామం కొండపై ఉన్న మాతాజీ ఆలయం మత సామరస్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. బగోరియా దేవి ఆలయంలో, ఒక సింధీ ముస్లిం కుటుంబం 13 తరాలుగా మాతృ దేవతను పూజించడంతో పాటు పూజారులుగా వ్యవహరిస్తోంది. భూపాజీ పూర్వీకులు దీనికి సంబంధించిన కథను చూస్తే.. చాలా కాలం క్రితం సింధీ పూర్వీకులు మాల్వా వైపు వెళ్తున్న సమయంలో ఒక రాత్రి అతని కలలో మాతృమూర్తి కనిపించి, కొండపై నిర్మించిన మెట్ల బావి నుండి నా విగ్రహం ఉందని, మీరు ఆ విగ్రహాన్ని పూజించండి అని చెప్పిందని చెప్పినట్లు అక్కడి వారి నమ్మకం.
GATE 2025: గేట్ 2025 రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడగింపు..
ప్రస్తుతం ఎనభై ఏళ్ల జమాలుద్దీన్ ఖాన్ భోపాజీ మాతకు సేవ చేస్తున్నారు. 500 – 600 సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు ఒంటెల కాన్వాయ్‌తో మధ్యప్రదేశ్‌లోని మాల్వాకు వెళ్తున్నారు. రాత్రిపూట పూర్వీకుల కలలో మాతృమూర్తి కనిపించి, మీరు నా విగ్రహాన్ని పూజించండి అని చెప్పడంతో అప్పటి నుండి తరతరాలుగా వారు అమ్మ సేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఇక ఇక్కడ ఆ కుటుంబం హిందూ మతం, సంస్కృతిని అనుసరిస్తూ.. తన శరీరం, మనస్సు, సంపదతో పూజారిగా సేవలు చేస్తున్నారు. గుడికి వెళ్లడంతో పాటు కుటుంబ సభ్యులంతా మసీదుకు కూడా వెళ్లి నమాజ్ చేస్తారు. ఈ ప్రాంత వాసులకు అన్ని రకాల పూజలు చేసేది ముస్లిం పూజారులే. గ్రామ ప్రజల మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. వారు సంతోషంగా భూపాజీని తమ పూజారిగా అంగీకరించారు.
Ireland vs South Africa: సెంచరీ చేసిన మాజీ రబ్బీ ప్లేయర్.. ఐర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు!
జమాల్ ఖాన్ పూర్వీకుల కాలం నుండి ఈ ఆలయంలో అమ్మవారిని పూజిస్తారు. ఈనాటికీ వారి నమ్మకాన్ని, ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాన పూజారి మా కుటుంబం నుంచి తయారైందని, మా నాన్న తర్వాత నేనే యాభై ఏళ్లుగా గుడిలో పూజారిగా అమ్మకు సేవలు చేస్తున్నానని జమాల్ ఖాన్ చెప్పారు. తాను, తన తండ్రి గత 56 ఏళ్లుగా ఆలయంలో అమ్మవారికి అర్చకులుగా సేవలందిస్తున్నామని తెలిపారు.