శనివారం రాజస్థాన్‌లోని షాపురా జిల్లా జహాజ్‌పూర్ సబ్‌డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌లో జల్ఝులనీ ఏకాదశి సందర్భంగా పీతాంబర్ రాయ్ మహారాజ్ (బేవాన్) ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. రాళ్లదాడిలో ఓ మహిళతో పాటు పలువురు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు రాళ్లురువ్విన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న జహజ్‌పూర్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాళ్లదాడి చేసిన నిందితులను గుర్తించి అరెస్టు చేసే వరకు ధర్నా కొనసాగిస్తానన్నారు. ఈ ఘటనతో జహజ్‌పూర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని మార్కెట్లు మూతపడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
READ MORE: Breaking News: కోల్‌కతా అత్యాచారం కేసులో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… జహజ్‌పూర్ పట్టణంలోని కోటతో సహా అన్ని దేవాలయాల దేవతల విగ్రహాలను ఏకాదశి రోజున భన్వర్ కాలా చెరువులో స్నానానికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రికి వారి వారి ఆలయాలకు తిరిగి వస్తున్నారు. అదే క్రమంలో.. కోట నుంచి లార్డ్ పీతాంబర్ రాయ్ మహారాజ్ మతపరమైన ఊరేగింపు.. మరో మతపరమైన స్థలం గుండా వెళ్తోంది. ఈ సందర్భంలో హిందుమతేతరులు ఈ ఊరేగింపుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత్ సింగ్ మేఘవంశీ, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామ్ బనాతో సహా భారీ పోలీసు బలగాలను సంఘటనా స్థలంలో మోహరించారు. అలాగే, అజ్మీర్ రేంజ్ డిఐజి ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. షాపురా నుంచి పోలీసు సూపరింటెండెంట్ పోలీసు బలగాలతో జహజ్‌పూర్ చేరుకుంటున్నారని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయన్నారు.