శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!
కావాల్సిన పదార్థాలు:
మిల్ మేకర్ (సోయా చంక్స్): ¾ నుంచి 1 కప్పు (చిన్నవి)
ఉల్లిపాయ: 1 (పెద్దది – నిలువుగా తరిగినవి)
టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: ¾ నుంచి 1 టీస్పూన్
పచ్చిమిర్చి: 1 నుంచి 2 (పొడవుగా కోసినవి)
జీలకర్ర: ½ టీస్పూన్
కరివేపాకు: ఒక గమ్మ
ఇంగువ: చిటికెడు
కారం: ½ టీస్పూన్
గరం మసాలా (లేదా కిచెన్ కింగ్ మసాలా): ½ నుంచి ¾ టీస్పూన్
పసుపు: చిటికెడు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం)
ఉప్పు: రుచికి సరిపడా
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో 3 కప్పుల నీటిని మరిగించి, అందులో సోయా చంక్స్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు నీటిలోనే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగి, నీరు ఏమీ లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పిండిన సోయా చంక్స్‌లో ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ¼ టీస్పూన్ కారం, ½ టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది. పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమాట గుజ్జుగా మారిన తర్వాత కారం, గరం మసాలా, సిద్ధం చేసుకున్న సోయా చంక్స్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి సన్నని మంటపై 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. (మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే లైట్‌గా నీళ్లు చల్లవచ్చు). మసాలాలన్నీ ముక్కలకు పట్టి మంచి సువాసన వచ్చే వరకు మరో 2-3 నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు, మసాలా సరిపోయాయో లేదో చూసుకుని, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఘుమఘుమలాడే సోయా చంక్స్ ఫ్రై రెడీ! ఈ శ్రావణ మాసంలో వేడివేడి అన్నంలోకి గానీ, రోటీల్లోకి గానీ ఈ కారకారంగా ఉండే సోయా డ్రై ఫ్రై ట్రై చేసి చూడండి!
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!