రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆర్‌ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ కన్నుమూసింది. శస్త్రచికిత్స విఫలం కావడంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపించారు. దీంతో బోధ్‌పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు.
2016 బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ (33) రెండు వారాల క్రితం జోధ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే జోధ్‌పూర్‌లో ఆమెకు చేసిన శస్త్రచికిత్స విఫలమైందని బంధువులు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు. దీంతో జోధ్‌పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ అగర్వాల్ ఐదుగురు సభ్యులతో కూడిన బృందంతో విచారణకు ఆదేశించారు. సంపూర్ణానంద్ మెడికల్ కాలేజీ (SNMC) ప్రిన్సిపాల్ భారతీ సరస్వత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం విచారణ చేపట్టనుంది.
ప్రియాంక బిష్ణోయ్.. బికనీర్‌కు చెందిన స్థానిక వాసి. రెండు వారాల క్రితం జోధ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. తదనంతరం ఆమె పరిస్థితి విషమించింది. ఆపరేషన్ సమయంలో వైద్యపరమైన లోపాలు జరిగాయని బంధువులు ఆరోపించారు.
ప్రియాంక బిష్ణోయ్.. జోధ్‌పూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నెల ప్రారంభంలో జోధ్‌పూర్ నార్త్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేయబడింది. అయితే ఆమె ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. బిష్ణోయ్ మరణానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సంతాపం తెలిపారు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ప్రియాంక బిష్ణోయ్ మరణం చాలా బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బాచ్డ్ సర్జరీ…
బాచ్డ్ సర్జరీ అనేది తప్పుగా జరిగే వైద్య ప్రక్రియ. ఇది రోగికి ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, వాటితో సహా నిర్లక్ష్యం, సరికాని పద్ధతులు, పరికరాల వైఫల్యం మరియు వైద్య నిపుణుల మధ్య తప్పుగా కమ్యూనికేషన్ ఉండడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తుంటాయి.