లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న నాగాంజలి.. ఈరోజు తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాగాంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నాగాంజలి మృతిపై రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు స్పందించారు.
Also Read: AP News: రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ ప్రారంభం!
‘మెడికల్ విద్యార్థిని అంజలి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం. నాగాంజలి మృతి చెందిన కారణంగా నిందితుడు దీపక్‌పై హత్య కేసు నమోదు చేస్తాం. మృతురాలి సూసైడ్ నోటు, ఘటనకు సంబంధించి హాస్పటల్లో సీసీ కెమెరా విజువల్స్ సేకరించాం. నాగంజలి రూమ్‌మేట్స్‌ని కూడా విచారించాం. నాగంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం దీపక్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరాం’ అని రాజమండ్రి డీఎస్పీ రమేష్ బాబు చెప్పారు.