POCSO : రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతి చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా… కులం తక్కువ దానివంటూ దూషిస్తూ.. ఆ బాలికకు అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు.. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారు. ఈ మేరకు పులపర్తి సత్యదేవ వద్దకు వెళ్ళి అమ్మాయిని పెళ్ళి చేసుకోమని బాధితురాలు కుటుంబ సభ్యులు అడిగారు. అయితే నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపులో మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని కోరాడు.
దీనితో 2024 డిసెంబర్ 17 వ తేదిన మైనర్ బాలికను ధవళేశ్వరంలోని ఓ అసుపత్రిలో జాయిన్ చేయించి అబార్షన్ చేయించారు.. మైనర్ ని పెళ్ళి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి పులపర్తి సత్యదేవ ఆచూకి తెలియలేదని, ఈ మేరకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు. ఇదే కాకుండా.. పెళ్లి చేసుకోమ్మని ఆడిగిన బాధిత బాలికను కులం తక్కువ దానివంటూ దూషినట్లు తెలుస్తోంది. అయితే.. అయితే.. మానవతా దృక్పథంతోనే బాధితురాలు కోరిక మేరకు కేసు నమోదుకు ఆలస్యమైందని డీఎస్పీ దివ్య అంటున్నారు. ఫోక్సో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాట మేరకు బాధితురాలు కోరికపై కేసు నమోదు ఆలస్యమైనట్లు చెబుతున్నారు.