చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది.
సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శ్రీకారం చుట్టారు. రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల పాత రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభించింది.
Also Read: Crime News: ఏడేళ్ల కొడుకుకు మందు తాగించిన తండ్రి.. చివరకు ఏమైందంటే?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపద్యంలో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు ప్రటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ సహా కూటమి నాయకులు పాల్గొన్నారు.