ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్‌ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా…
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆ టీడీపీ నాయకుడు ఫిక్స్ అయ్యారు. మరి.. వైసీపీ నుంచి ఆయనకు ప్రత్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీ పోరుకు సై అంటారా? ఇద్దరి మధ్య సవాళ్లు.. విమర్శలు ఇస్తున్న సంకేతాలేంటి? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..! కొద్దిరోజులుగా రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్..…
ఏపీలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉండటమే దానికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా.. ఇప్పటి నుంచి పావులు కదుపుతున్న నేతలు ఎక్కువే. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో రాజమండ్రి అర్బన్, రూరల్ ఓటర్లు టీడీపీకే…
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసు కస్టడీ పిటిషన్ పై మిస్టరీ నెలకొంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కు పొంతనలేదు. మరో కొత్త సీన్ క్రియేట్ చేయడానికే కస్టడీ పిటిషన్ వేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతుడు తల్లి ఈ హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పోలీసులు కొత్త చిక్కుల్లో పడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గత నెల 19న…