అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. నృత్య, జానపద కళాకారుల్ని…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక పంపింది.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్.. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.. కేంద్రం ఉత్తర్వులపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.. రాజమండ్రి అభివృద్ధికి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందన్నారు.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరైంది.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు…
ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదార్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు ఎంపీ మార్గాని భరత్. వన్ టైం సెటిల్మెంట్ పథకం ఒక చక్కని కార్యక్రమం అన్నారు భరత్. ఉరివేయడం, విషం తాగడం అంటూ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలో పేదలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలు వివిధ…
సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు,…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో యువకుడి హత్య సంచలనం రేపుతోంది. గత నెల 24న నాగసాయి అలియాస్ వెంకటేష్ (25) అనే యువకుడిని నలుగురు నిందితులు హత్య చేశారు. వెంకటేష్ మృతదేహాన్ని నిందితులు ముక్కలు చేసి రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read Also: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన…
తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఓ ప్రియుడి ఆవేదన చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. అతడి బాధను చూస్తే ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెన్సిటివ్ మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ ప్రేమజంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ ప్రేయసి తన ప్రియుడిని దూరం పెట్టింది. ఈ విరహాన్ని తట్టుకోలేని ప్రేమికుడు తన ప్రేయసి మనసు మార్చడం కోసం, తన తప్పును క్షమించమని అడగడం కోసం వినూత్న…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లింగంపేట వాంబే గృహాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని బత్తిన నగర్ కు చెందిన మువ్వల దుర్గా ప్రసాద్ గా గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు. దుర్గా ప్రసాద్ ను కత్తితో నరికి చంపి పరారయ్యారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు త్రీటౌన్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల రాక పెరిగింది. టీటీడీ ఏటా ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ వుంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంటిలో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్లో అధిక ధరలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో టీటీడీ క్యాలండర్స్,డైరీల పేరుతో క్యాష్ చేసుకుంటున్న…
రాజమండ్రిలో ఇద్దరు చిన్నారులను హతమార్చింది కసాయి తల్లి పూరేటి లక్ష్మీ అనుష్క. ఆమెను అదుపులోకి తీసుకున్నారు త్రీటౌన్ పోలీసులు. తల్లిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీ అనుష్క కు పలువురితో అక్రమ సంబంధం, సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తల్లి, తమ్ముడు అనుమానిస్తున్నారని మనస్తాపం చెంది పిల్లలను హతమార్చి అనుష కూడా ఆత్మహత్య చేసుకోవాలని…