తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్దకు పోటుత్తుతున్న వరద పోటెత్తుతోంది. భారీవర్షాలతో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. సముద్రంలోకి లక్షా 15 వేల క్యూసెక్కుల వరద జలాలు విడుదల చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 9.7 అడుగులకు చేరింది. 175 గేట్ల ద్వారా వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాజమండ్రి కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు. ఏమైనా సమాచారం కోసం 8977935609నెంబర్ ని సంప్రదించవచ్చు.
గోదావరికి ఆకస్మిక వరదల నేపథ్యంలో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం. గోదావరి వరద ప్రవాహం, భారీ వర్షాలతో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలలో ఇబ్బందులు, ఇతర సహాయం కోసం 494060060, 0883 247993 సంప్రదించాలని అధికారులు సూచిస్తు్న్నారు. ఇటు కాకినాడ జిల్లాకు భారీ వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించింది. నేటి నుంచి ఈ నెల 12 వరకు వర్షాలు కురుస్తాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టరేట్ కు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.
Amaranath Yatra: అమరనాథ్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య