ఏపీలో మూడు రాజధానుల రచ్చ (3 capitals Row) కొనసాగుతోంది. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులకు చంద్రబాబే కారణం అన్నారు. చట్టబద్ధత కలిగిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు బుట్ట దాఖలు అయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నామన్నారు. సచివాలయాలు ఏర్పాటు ఇందులో భాగమే అని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు.
Read also: Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర.. ఆరుచోట్ల పేలుళ్లకు ప్లాన్
భవిష్యత్తు తరాలకు జరిగే మేలులో మనం కూడా భాగస్వాములు అవ్వాలి…ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మీరు చేసే పూజలు, ప్రతి ఆలయాల్లో ముఖ్య మంత్రి నిర్ణయానికి నినాదంగా ఉండాలి…ప్రతి వ్యక్తి ఆకాంక్ష…ప్రతి సామాజిక వర్గ నిర్ణయాన్ని ఈ సమావేశంలో వినిపించారు..తెలుగు దేశం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అన్నారు మంత్రి వేణు. మహిళలు కార్లు ఎక్కి తొడలు కొడుతున్నారు.
ఇవన్నీ కవ్వింపు చర్యలు. వైసీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ అభివృద్ధి అని ఉంది..వికేంద్రీకరణ ఎజెండాలో ఒక భాగం. జగన్ పాదయాత్రలో సమస్యలు నేరుగా చూసి ..పాలన ఎలా అందించాలి అని లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి (jaganmohan Reddy)ది అన్నారు. ఈ సమావేశానికి ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షత వహించారు.
Read Also: Shashi Tharoor: ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్.. మేమంతా ఒక్కటే, సిద్ధాంత వైరుధ్యాలు లేవు..