YCP : పక్కా ప్లాన్ తో రాజమండ్రి రాజకీయాలను వేడెక్కిస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆ టీడీపీ నాయకుడు ఫిక్స్ అయ్యారు. మరి.. వైసీపీ నుంచి ఆయనకు ప్రత్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీ పోరుకు సై అంటారా? ఇద్దరి మధ్య సవాళ్లు.. విమర్శలు ఇస్తున్న సంకేతాలేంటి? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
కొద్దిరోజులుగా రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాసుల మధ్య ఉప్పు నిప్పులా మారుతున్నాయి రాజకీయాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరే రాజమండ్రి అర్బన్ బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే వాదన స్థానికంగా వినిపిస్తోంది. ప్రధాన పార్టీలు వీరికే టికెట్లు ఇస్తాయన్న గ్యారెంటీ లేకపోయినా.. నాయకులు మాత్రం పక్కా ప్లాన్‌తో లోకల్ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నారు.
Also Read
రాజమండ్రి అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ఎంపీ భరత్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో కీలకంగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారాయన. పైగా రాజమండ్రిని తన అడ్డాగా చెప్పుకొచ్చారు భరత్. ఈ వ్యాఖ్యలకు వేగంగానే బదులిచ్చారు ఆదిరెడ్డి వాసు. కేవలం ప్రతి విమర్శలతో సరిపెడితే బాగోదని అనుకున్నారో ఏమో.. భరత్‌కు ఓ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని.. వైసీపీ నుంచి భరత్ బరిలో ఉంటే రాజమండ్రి ఎవరి అడ్డానో తేలిపోతుందని సవాల్ చేశారు వాసు. ఆ తర్వాత ఈ మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. రెండు పార్టీలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలు కూడా సవాళ్లు చేసేసుకుంటున్నారు.
వాస్తవానికి ఎంపీ భరత్ మూడేళ్లుగా స్థానిక టి.డి.పి. నేతలపై విమర్శలు చేయలేదు. రాజమండ్రి సిటీ… రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారి గురించి మాట్లాడిన సందర్భాలు తక్కువే. అలాంటిది సడెన్‌గా నియోజవర్గ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఎంపీ లక్ష్యంగా చేసుకోవడం చర్చగా మారింది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన బదులు తన భర్త వాసు బరిలో ఉంటారని చెప్పారామె. ఆ తర్వాతే క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది.
రాజమండ్రి అర్బన్‌లో ప్రస్తుతం వైసీపీ కోఆర్డినేటర్ పోస్ట్ ఖాళీగాఉంది. కొత్తగా ఎవరిని నియమిస్తారో కేడర్‌కే తెలియడం లేదట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలో దిగితే ఎలా ఉంటుందో అని భరత్ లెక్కలేస్తున్నారట. ఎప్పుడూ లేనంతగా రాజమండ్రిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. అందుకే సిటీ టీడీపీలో కీలకంగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ బరిలో ఈ ఇద్దరి పోటీకి ఆయా పార్టీలో అంగీకరిస్తాయా అనేది మరో ప్రశ్న. రాజమండ్రి టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఆదిరెడ్డి కుటుంబానికి పడటం లేదు. సిటీ సీటుపై గోరంట్ల కూడా కన్నేశారు. ఇక ఎంపీ భరత్ విషయానికి వస్తే.. ఆయన్ని అసెంబ్లీ బరిలో దించే సాహసం చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయట. గత రెండు ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇచ్చినా వైసీపీకి గెలుపు దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓసీకి ఛాన్స్ ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో భరత్ పోటీపై పార్టీ వర్గాలే సందేహాలు వ్యక్తం చేసే పరిస్థితి. క్షేత్రస్థాయిలో వైసీపీ, టీడీపీలో జరుగుతున్న చర్చ ఇదైతే.. అవేమీ పట్టనట్టు భరత్, వాసులు ప్రకటనలు చేసేస్తున్నారు. మరి.. రాజమండ్రిలో ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!