తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు భారీగా నీరు చేరడంతో.. గేట్లు తెరిచి మూసీలోకి నీటిని…
రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ…
హైదరాబాద్ నగరం వారం రోజులపాటు గజగజా వణికిపోయింది. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. గత 54 ఏళ్లలో ఇంత తక్కువ టెంపరేచర్లు నమోదుకావటం ఇదే తొలిసారి. జూలై 13వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువ(20 డిగ్రీల సెల్సియస్)కు పడిపోయింది. 1968 జూలైలో ఓ రోజు 18.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డవగా ఇప్పటివరకు అదే కోల్డెస్ట్ డేగా నిలిచింది. ఈ నెల 13న ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో గడచిన ఐదు…
వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే వారం రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్నాయి. గత పాతికేళ్లలో వరుసగా ఇన్ని రోజులు ముసురు పట్టడం ఇదే తొలిసారి కావొచ్చు. దీంతో పొద్దు పొడవక, సూర్యుణ్ని చూడక ఎన్ని రోజులైందో అన్నట్లుంది. ‘సన్’డే ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. సెలవు కోసం కాదు. వాన ఇంకెప్పుడు సెలవు తీసుకుంటుందా అని. వాతావరణం విపరీతంగా చల్లబడటంతో బయటికి రాలేక, ఇంట్లో ఉన్నా తలుపులూ కిటికీలూ తెరుచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా…