తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయం నుంచి భద్రాచలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లారు. గోదావరి వరద జలాలతో నిండిపోయిన భద్రాద్రి రామాలయం, పరిసర ప్రాంతాలు, కరకట్ట మీదుగా గోదావరి బ్రిడ్జి, కూనవరం రోడ్డు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లు, వరద తీవ్రతను పరిశీలించారు. భద్రాచలంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావసకేంద్రాన్ని సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గోదావరి వరదలని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వేని చేయాలి భట్టి విక్రమార్క అన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గోదావరి పరివాహ ప్రాంతాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు. భద్రాచలం వెళ్తుండగా బ్రిడ్జి వద్ద పోలీసులు బట్టి విక్రమార్కని అడ్డుకున్నారు. భద్రాచలంలో పునరావాస కేంద్రాలని కరకట్టని భట్టి విక్రమార్క పరిశీలించారు. ప్రభుత్వ యంత్రాంగం గోదావరి వరదలపై కనీస జాగ్రత్త గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులకు ధైర్యం చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క.