తెలంగాణాను వరుణుడు వీడనంటున్నాడు. నాలుగైదు రోజుల నుంచి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.…
ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు మరియు పొరుగున ప్రాంతాల్లో ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం, అమరావతి వెల్లడించింది.. దీని ప్రభావంతో.. రాబోయి మూడు…
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం…
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్‌పేట్, పంజాగుట్ట,…