గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం అసోంను కుంగదీస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత వరదల కారణంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 11 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. మానస్, పగ్లాదియా, పుతిమరి, కొపిలి, గౌరంగ్, బ్రహ్మపుత్ర నదుల నీటిమట్టం కూడా అసోంలోని పలు చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. గోల్‌పరా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు…
హైదరాబాద్ లో మరోసారి భారీగా కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్‌పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రుతుపవనాల ప్రవేశంతో బుధవారం నాడు…
తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…
రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, దక్షిణ…
రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల ఆనకట్టకు…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా? అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. పంట లేటుగా వేస్తే.. గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెపుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు…. వరి వేస్తె ఉరే అని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కొనం కొనం…
భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్‌లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్‌ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ. Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..! ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో…
కర్నాటకలోని తుంగభద్ర జలాశయం నిండుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,342 క్యూసెక్కులుగా వుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్…