Hyderabad: గజగజ వణికిన హైదరాబాద్. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరం వారం రోజులపాటు గజగజా వణికిపోయింది. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. గత 54 ఏళ్లలో ఇంత తక్కువ టెంపరేచర్లు నమోదుకావటం ఇదే తొలిసారి. జూలై 13వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువ(20 డిగ్రీల సెల్సియస్)కు పడిపోయింది. 1968 జూలైలో ఓ రోజు 18.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డవగా ఇప్పటివరకు అదే కోల్డెస్ట్ డేగా నిలిచింది. ఈ నెల 13న ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో సెకండ్ కోల్డెస్ట్ డేగా నమోదైంది.
ఇదే నెల 10వ తేదీన కూడా టెంపరేచర్ 20.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవటంతో థర్డ్ కోల్డెస్ట్ డేగా ఇండియా వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఐఎండీ డేటా ప్రకారం ఈ నెల 11న 21 డిగ్రీలు, 12న 20.8, 14న 21.3 డిగ్రీలు, 15న 22.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే భాగ్య నగరం ఇటీవల ఎన్నడూలేనంత చారిత్రక చలి రోజులను అనుభవించినట్లయింది. జూలై 9 నుంచి 5 రోజులపాటు సిటీ మీద దట్టమైన మేఘాలు కమ్ముకోవటం, ఏకబిగిన వర్షం కురవటం, ముసురు దీనికి ప్రధాన కారణాలు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఎట్టకేలకు ఈ చలి దుప్పటి నుంచి హైదరాబాద్ తేరుకుంది. మేఘాలు తొలిగిపోయి సూర్యుడు కనిపించటంతో ఉష్ణోగ్రతలు యాధా స్థితికి వచ్చేశాయి. అయినప్పటికీ రేపటి నుంచి 19వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అంటే 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని అర్థం. హైదరాబాద్‌తోపాటు నార్తర్న్, సెంట్రల్ తెలంగాణ పరిధిలోని 10 జిల్లాలకు ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఎల్లో అలర్ట్ కింద ఉన్న కొన్ని జిల్లాలు.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!