రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వెల్లడించారు.
దీంతో.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఉదయం 6:30 గంటల నుంచి చిరుజల్లులతో మొదలైన వాన 7 గంటల నుంచి భారీగా కురిసింది. దీంతో నగరం వాన జల్లుతో మళ్లీ తడిసి మద్దైంది. భాగ్యనగరంలో దాదాపు అన్ని చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, టోలిచౌకి, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లి, అంబర్‌పేట్, రామంతాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశంవుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నాగర్‌కర్నూల్ , నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి , సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
Samantha: తదుపరి సినిమాలో సంచలన పాత్ర.. ఎలా చేస్తుందో?