Poojas for Rains: అక్కడ వర్షాల కోసం పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో వానలు నానా బీభత్సం సృష్టి్ంచాయి. వరదల నుంచి ఇంకా కోలుకోని ప్రాంతాలు అనేకం వున్నాయి. అయితే నిత్యం కరువుతో బాధపడే అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు వర్షాల కోసం పూజలు చేయడం విశేషం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో వానలు కురవాలి, మా చెరువులు నిండాలంటూ పూజలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. వేకువ జామునే కప్పలను కుండలో నెత్తిన పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి జలాభిషేకం చేశారు.
అనంతరం గ్రామంలోని కాటమయ్య స్వామి దేవస్థానం వద్దకు మహిళలు, గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు.అనంతరం వానలు కురవాలంటూ గ్రామస్తులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఇలా పూజలు చేస్తే వర్షాలు వస్తాయని నమ్మకం వుందంటున్నారు గ్రామస్తులు. వర్షాలు రాక పొలాల్లో వేసిన వేరుశెనగ,కంది ఇతర పంటలు అన్నీ ఎండిపోతున్నాయన్నారు .అందుకనే మా గ్రామంలో ఇలా కప్పలమ్మ అనే అమ్మవారికి పూజలు చేస్తే వర్షాలు వస్తాయనే నమ్మకంతో గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో వరుణ జపాలు, శివుడికి అభిషేకాలు నిర్వహించారు.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
గతంలో తెలంగాణలో వానల కోసం నూటొక్క కాడెద్దులతో… వెయ్యిపదహారు బిందెలతో.. కృష్ణానది నీటిని తెచ్చి ఆంజనేయస్వామికి అభిషేకం చేశారు. గద్వాల జిల్లాలో ఈ తరహా పూజలు జరిగాయి. కృష్ణానది దగ్గరకు చేరుకుని 1016 బిందెలలో కృష్ణా నీళ్లను తెచ్చి స్థానిక ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. కృష్ణమ్మ ఒడ్డున చేరి వానలకోసం ప్రార్ధిస్తామని, వర్షం కురిస్తే మళ్లీ కృష్ణమ్మకు నదీ హారతి ఇచ్చి, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే.. గండిపేట జలాశయంలో వరుణ జపం చేశారు. తెలంగాణలో వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తు్ంటే.. అనంతపురం వాసులు మాత్రం పూజలు చేయడం విచిత్రంగా వుంది కదా.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!