హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
ఎప్పుడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. వడగాల్పులతో అల్లాడిపోతున్నారు జనం.. అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రండి అంటూ వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వడగాల్పులు తగ్గడంతో పాటు.. వర్షలు కురిసే అవకాశం ఉందని ఈ రోజు వెల్లడించింది.. ఈ నెల 4వ తేదీ వరకు దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు వీచే…
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా…
తమిళనాడుకు ఒక వరుణగండం తీరింది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. లాండ్ ఫాల్ తర్వాత వాయుగుండం తీవ్ర తగ్గుతుందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే, శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ఇటు తూర్పు…
ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది… గత మూడు రోజులుగా హస్తినను వీడడం లేదు వర్షాలు.. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 112 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ ఇంత వర్షం పడలేదు. 2010 సెప్టెంబర్ 20న ఢిల్లీలో 110 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసింది. ఢిల్లీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ -NCR పరిధిలోని గురుగ్రామ్, మనేసర్, ఫరిదాబాద్,…
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి…