Telangana Weather : దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం , పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు అదే ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ స్థితుల ప్రభావంతో రాబోయే మూడు…
IMD : భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, దేశాన్ని ప్రభావితం చేసిన ఎల్ నినో పరిస్థితులు తొలిగిపోయాయి. దీని ప్రభావంతో గత ఏడాది పాటు ప్రతీ సీజన్ ఆలస్యంగా మొదలైందీ కాక, సాధారణ దినాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతి…
Hyderabad Rain : హైదరాబాద్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ మార్పుతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షపు జల్లు కురిసింది. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తాజా ప్రకటన…
Amavasya Effect: విజయవాడకి అమావాస్య గండం పొంచి ఉంది. ఈ అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నది. పోటు మీదుంటే వరదని తనలోకి సముద్ర ఇముడ్చుకోదు.. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు మరింత పెరిగే అవకాశం ఉందనే భయం మొదలైంది.
వర్షాలు కురవడం కోసమని క్లౌడ్ సీడింగ్‌ని ఉపయోగించడం గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇండోనేషియా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడకుండా ఉండటానికి క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిజానికి, ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 67 మంది మరణించారు.. మరో 20 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 44 మంది గాయపడ్డారు. వరదల కారణంగా పలు ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో 1500 కుటుంబాలు…
Monsoon: ఈ సారి రుతుపవన కాలంలో వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రుతపవనాలకు అనుకూలంగా పసిఫిక్ మహాసముద్రంలో ‘‘లానినా’’ పరిస్థితులు ఆగస్టు- సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.