ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది.
ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా బలపడుతుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళా ఖా తం లో తుపాన్ గా మారుతుంది .ఇది తరువాత వాయువ్య దిశలో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతం తీరమువరకు ప్రయాణించి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి డిసెంబర్ 4వ తేదీకల్లా చేరవచ్చును. తరువాత ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశలో ప్రయాణించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు అందచేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాలలో ప్రధానంగా పొడి వాతావరణం వుంటుంది. రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు ప్రధానంగా పొడి వాతా వరణం వుంటుంది. రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నికురిసే అవకాశముంది .ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది.
ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.