ఎప్పుడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. వడగాల్పులతో అల్లాడిపోతున్నారు జనం.. అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రండి అంటూ వాతావరణశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వడగాల్పులు తగ్గడంతో పాటు.. వర్షలు కురిసే అవకాశం ఉందని ఈ రోజు వెల్లడించింది.. ఈ నెల 4వ తేదీ వరకు దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, తూర్పు, దక్షిణ భారత్‌లో 6వ తేదీ వరకు, ఈశాన్య ప్రాంతంలో 3వ తేదీ వరకు ఈదురుగాలుతో కూడి వర్షం కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. మొత్తంగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాల్పులకు అల్లాడుతోన్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెవిలో వేసింది.
Read Also: TS Inter Exams: ఇంటర్ పరీక్షలు.. ఆ నిబంధన వర్తింపు