దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
కాలిఫోర్నియాను (California) ఓ భారీ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రహదారులు జలమయం కావడంతో పాటు ఇళ్లన్నీ నీట మునిగాయి. బురద ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రాని లేని పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. రోడ్లపై పేరుకు పోయిన రాళ్లను, చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీరప్రాంతాలన్నీ దాదాపుగా వరదల్లో చిక్కుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన…
Weather Update Today: భారత వాతావరణ విభాగం (IMD) దేశంలోని వాయువ్య ప్రాంతంలో దట్టమైన పొగమంచు హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ బులెటిన్ ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో వాయువ్య భారతదేశంలో దట్టమైన నుండి చాలా దట్టమైన పొగమంచు వ్యాపించవచ్చు.
181.5 mm rainfall in AP: ఏపీలో ‘మిచాంగ్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. తుఫాన్ దాటికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయం అవ్వగా.. రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చేతికి…
Weather Update: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. దీని కారణంగా దృశ్యమానత తగ్గుతుంది.
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఈ ఆగస్టు నెల చరిత్ర సృష్టించింది. దేశంలో గత వందేళ్లల్లో ఎప్పుడులేనంతగా తక్కువ వర్షపాతం నమోదయింది. వందేళ్ల చరిత్రలో ఇదే తక్కువ వర్షపాతం నమోదైన ఆగస్టు నెల అని అధికారులు ప్రకటించారు.