Agnipath Scheme Protest LIVE Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్‌కు సంబంధించిన డిజైన్లు పూర్తి కాగా ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. అయితే తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్‌లపై తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు స్థానిక ఎంపీ మద్దిల…
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దారుణం వెలుగుచూసింది. విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ధన్‌బాద్-అలిప్పి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో బీ1 బోగీ టాయ్‌లెట్ వాష్‌బేసిన్‌లోకి వెళ్లి చూడగా తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. Read Also: CM Jagan: తుఫాన్ బాధితులకు రూ.2వేలు పరిహారం మెరుగైన వైద్యం కోసం మగశిశువును వెంటనే రైల్వే…
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు. 28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న…
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది.. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్ నుంచి పుతిన్ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందారు. 100…
ఉక్రెయిన్‌పై మళ్లీ భీకర యుద్ధం చేస్తోంది రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. అప్పుడప్పుడు తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్న రష్యా బలగాలు.. అంతర్జాతీయంగా రోజురోజుకీ తీవ్రమైన ఆంక్షలు వస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. మరోసారి ఉక్రెయిన్‌పై బాంబులపై వర్షం కురిపించింది.. తూర్పు ఉక్రెయిన్‌ను టార్గెట్ చేసిన రష్యా బలగాలు.. రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులకి దిగింది.. ఈ ఘటనలు 30 మందికి పైగా పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.. ఇక, 100 మందికి పైగా…
అపాయం కలిగినపుడే ఉపాయం ఆలోచించాలి. మెదడు షార్ప్‌గా పనిచేయాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్రమాదంలో చిక్కకున్నామని తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలియక కాళ్లు చేతులు వణికిపోతాయి. ఆ సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. పొంచిఉన్న ప్రమాదం దూరంగా ఉన్నప్పటికీ దగ్గరికి వచ్చేస్తుందని భావించి తప్పించుకోలేక దానికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంటాము. Read: Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా? అయితే, బీహార్‌లోని…
ఈమధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అయితే, సకాలంలో స్పందించిన పోలీసులు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది. వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ఒక మహిళ కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది.…
అత్యాచార ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఎక్కడో ఓ దగ్గర దారుణమైన ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణమైన ఘటన బయటపడింది.. కదులుతున్న రైలులోనే ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.. నివేదికల ప్రకారం ఢిల్లీకి చెందిన యువతి.. ముంబై నుండి ఢిల్లీకి తిరిగి వెళ్తుంది.. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది… బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన వద్ద ధృవీకరించబడిన టికెట్ లేదని, అందుకే…
అయ్యే ఊరికి వెళ్లిపోతున్నాం.. పెండింగ్ పనులు అలానే ఉన్నాయి.. ఇంకా బిల్లులు కట్టాల్సి ఉంది.. అనే టెన్షన్ అవసరం లేదు.. ఊరికి వెళ్లే ముందు.. నేరుగా రైల్వేస్టేషన్‌కే వెళ్లి.. అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చేస్తోంది.. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్ రీచార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆధార్ కార్డు సంబంధ సేవలు, పాన్ కార్డు దరఖాస్తు, ట్యాక్స్ చెల్లింపులు సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది.. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో రైలు టికెట్లతో…