MP Guru Murthy: తిరుపతి రైల్వేస్టేషన్ కొత్త డిజైన్‌లపై అభ్యంతరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైల్వేస్టేషన్‌కు సంబంధించిన డిజైన్లు పూర్తి కాగా ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. అయితే తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్‌లపై తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు స్థానిక ఎంపీ మద్దిల గురుమూర్తికి తమ అభ్యంతరాలను వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విన వైష్ణవ్ ప్రకటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని గురుమూర్తి ట్విట్టర్ వేదికగా తెలిపారు. భారతీయ వాస్తు శాస్త్రం ప్రతిబింబించేలా తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూ.299 కోట్లతో ప్రపంచ స్థాయి తరహాలో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనుందని.. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చిరకాల కల అని అది ఇన్నాళ్లకు నెరవేరనుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
Also Read
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తిరుపతి ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త! pic.twitter.com/X3Vd0TDd9Z
— Maddila Gurumoorthy (@GuruMYSRCP) May 31, 2022
తాజావార్తలు
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..