మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలతో గుంటూరు జిల్లా వణుకుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా కొనసాగుతున్న మహిళలపై లైంగిక దాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్16న గురజాల రైల్వేస్టేషన్ లో ఒడిషాకు చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. 27న కొల్లూరు మండలం చిలుమూరులో రూపశ్రీ అనే మహిళను పొలంలోనే హత్య చేశాడు ప్రవీణ్ అనే దుండగుడు.
28న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత తిరుపతమ్మ హత్యకు గురయింది. కోరిక తీర్చలేదని గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. 29న దుగ్గిరాల మండలం శృంగారపురంలో మహిళాకూలీపై అర్దరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడాడు కిరణ్ అనే కామాంధుడు. తాజాగా రేపల్లె రైల్వేస్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్ ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో జిల్లాలో కలకలం రేగుతోంది. మహిళపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఇదిలా వుండగా.. రేపల్లె రైల్వేస్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించారు సీఎం జగన్. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి పనుల కోసం ఆ మహిళ రేపల్లెకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపల్లె నుంచి కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిందా మహిళ. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ వుందేమో అని పరిశీలిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ అసమర్థత వల్లే మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Nara Lokesh: బీహార్‌ని మించిపోతున్న ఏపీ