చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లే దారి, బయటకు వచ్చేదారి వేరువేరుగా ఏర్పాటు చేయబోతున్నారు. రైల్వేస్టేషన్ కి వచ్చే ప్రయాణికులు జ్ఞానాపురం గెట్ వద్దనున్న ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫామ్ మీదుగా లోపలికి అనుమతిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేవారికి ఒకటో నెంబర్…