Ukraine Russia War: మళ్లీ విరుచుకుపడుతోన్న రష్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది.. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్ నుంచి పుతిన్ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మిస్సైల్ దాడులతో రైల్వే స్టేషన్ జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు జనాన్ని తరలిస్తున్న సమయంలో ఈ స్టేషన్‌లో దాడులు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
Read Also: TSRTC: మళ్లీ చార్జీలను పెంచిన ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో భారీగా వడ్డింపు..
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
మరోవైపు, ఖర్కివ్ ప్రాంతం రష్యా బలగాల కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. 24గంటల వ్యవధిలో 48సార్లు కాల్పులు జరిగాయి. రష్యా బలగాలునివాస ప్రాంతాలపై దాడి చేసేందుకు ఫిరంగిలు, యుద్ధ ట్యాంకులు, బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. అటు రష్యా దూకుడును ఉక్రెయిన్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. శత్రుసేనల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పట్నుంచి 19వేల మందికి పైగా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 700 ట్యాంకులు, 1891 సాయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ నుంచి బహిష్కరించినప్పటికి రష్యా దూకుడు తగ్గడం లేదు. రష్యా దళాల దాడుల తర్వాత అనేక ఉక్రెయిన్ నగరాల్లో భవనాలు, రోడ్లు, రవాణా వ్యవస్థ పూర్థి స్థాయిలో ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరుల మరణాల కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!