Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్…
సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ…
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించి, ఆందోళన చేసి రైళ్ళకు నిప్పు పెట్టారు. అగ్నిపథ్ ను కేంద్రం వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అగ్నిపథ్ తో వారి కుటుంబాలు రోడ్డు పడతాయని మండిపడ్డారు. రెండు, మూడేళ్ల నుంచి ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తుంటే అగ్నిపథ్ స్కీం తీసుకు వచ్చి కేంద్రం…
అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ వేల మంది అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టషన్ లో ఉదయం ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకువచ్చారు. రైళ్లకు నిప్పు పెట్టారు. కట్టెలు, రాడ్లు, రాళ్లతో అక్కడి షాపులపై దాడులు చేశారు. పోలీసుల కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు దీంతో (శనివారం) నేడు అల్లర్లు జరగకుండా మందస్తు చర్యగా జంటనగరాల్లో తిరిగే ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు చేసిన…
కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళన వద్దన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రైల్వే అస్తులు విధ్వంసం వెనుక కుట్ర వుందన్నారు. అగ్నిపథ్ పధకం యువతకు చాలా ఉపయోగకరమనే విషయాలు తెలియని యువత అవేశాలకు లోనవుతున్నారు. సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన వారు సంఘ విద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయి. భారత సైన్యంలో చేరాలని కలలు కంటున్న యవతకు అగ్నిపథ్ ఒక సువర్ణావకాశం లాంటిది. సంఘ విద్రోహ శక్తులతో ప్రధాని పై వ్యతిరేక ప్రచారం…
నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ.. ఆయన శుక్రవారం మీడియాతో మాడారు. సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని అన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. సైనికులకు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. దామోదర్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 8 మందికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వేశాఖ…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి…