విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దారుణం వెలుగుచూసింది. విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బందికి ధన్‌బాద్-అలిప్పి ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో బీ1 బోగీ టాయ్‌లెట్ వాష్‌బేసిన్‌లోకి వెళ్లి చూడగా తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించాడు. ఈ విషయంపై ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
Read Also:
మెరుగైన వైద్యం కోసం మగశిశువును వెంటనే రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైలులో దొరికిన శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే తల్లి కావాలనే శిశువును రైలులో వదిలి వెళ్లినట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. కన్నతల్లే కర్కశంగా వ్యవహరించిందని తెలిపారు. దీంతో తల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
