అత్యాచార ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఎక్కడో ఓ దగ్గర దారుణమైన ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణమైన ఘటన బయటపడింది.. కదులుతున్న రైలులోనే ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది.. నివేదికల ప్రకారం ఢిల్లీకి చెందిన యువతి.. ముంబై నుండి ఢిల్లీకి తిరిగి వెళ్తుంది.. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది… బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తన వద్ద ధృవీకరించబడిన టికెట్ లేదని, అందుకే తాను రైలులోని AC-III కోచ్ వెలుపల కూర్చున్నానని పేర్కొంది.. రైలు హర్దా రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా, ప్యాంట్రీ కార్ మేనేజర్ వచ్చి ఆమెను జనరల్ కోచ్‌కి వెళ్లమని సూచించగా.. ఇది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి, తనను ఏసీ కోచ్ బయట కూర్చోవడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థించింది.
Read Also: KCR: యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయింది..
అయితే, కంపార్ట్‌మెంట్ బయట కూర్చోవడం ఆమెకు సురక్షితం కాదని మేనేజర్ ఆమెను ప్యాంట్రీ కార్ కోచ్‌కి రప్పించాడు.. ఆ తర్వాత నిద్రిస్తున్న తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు.. ఎవరికైనా చెబితే రన్నింగ్ ట్రైన్‌లోంచి బయటకి తోసివేస్తానని బెదిరించాడని సదరు యువతి GRP సిబ్బందికి చెప్పింది. దీంతో.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తామని జీఆర్‌పీ అధికారి వెల్లడించారు.. శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని GRP సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హితేష్ చౌదరి తెలిపారు. రైలులో దాక్కున్న అనుమానితుడిని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. బాధితురాలు భోపాల్‌లో దిగి, జరిగిన ఘోరాన్ని GRPకి వివరించినట్లు ఎస్పీ తెలిపారు. అరగంట సేపు ఆగిన తర్వాత కొందరు వ్యాపారులను పోలీసులు విచారించిన తర్వాత రైలు వెళ్లిందన్నారు.. ఈ ఘటనలో కొందరు చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.