తెలంగాణ కాంగ్రెస్ మరో కొత్త సంప్రదాయానికి తెర తీయాలని చూస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం మొదలుకొని…ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కూడా టికెట్ల కేటాయింపుపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఖరి వరకు కాకుండా…అరు నెల్ల ముందే అభ్యర్థుల ప్రకటన ఉండాలని చర్చకు పెట్టారు నేతలు. మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశం లో కూడా సీనియర్ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఐతే టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్‌లో. రాహుల్ గాంధీ…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే..ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి…
ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు…
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రతిపక్షాలు గజగజ వణకాల్సిందే. ఆయన ప్రజల మనిషని, ప్రజలకై పోరాడతారనేది తెలంగాణ ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో.. ప్రజల తరపున కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్…
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని…
వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు. ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం…
టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. మూడున్నర గంటల పాటు శాంతియుతంగా సమావేశం నిర్వహించినట్టు నేతలు తెలిపారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే…మానిక్కం ఠాగూర్ తో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని సూచించారు కన్వీనర్ షబ్బీర్ అలీ. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను సమాన శత్రువులుగా అభివర్ణించింది పీఏసీ. కేసీఆర్ రాహుల్ గాంధీ కి మద్దతు ఇచ్చి…ఏడేళ్లుగా పార్టీని తిట్టిన తీరు మర్చిపోలేం అన్నారు. పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులపై…
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సభ్యత్వం తీస్కున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందేలా, ప్రమాదం జరిగి ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో సందడి చేశారు. తనదైన రీతిలో అందరితో కలిసిపోయారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. ప్రోటోకాల్ వద్దంటున్నా రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్.. అక్కడి బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు…