టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. మూడున్నర గంటల పాటు శాంతియుతంగా సమావేశం నిర్వహించినట్టు నేతలు తెలిపారు. నాయకులు వ్యక్తిగత సమస్యలు ఉంటే…మానిక్కం ఠాగూర్ తో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని సూచించారు కన్వీనర్ షబ్బీర్ అలీ. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను సమాన శత్రువులుగా అభివర్ణించింది పీఏసీ. కేసీఆర్ రాహుల్ గాంధీ కి మద్దతు ఇచ్చి…ఏడేళ్లుగా పార్టీని తిట్టిన తీరు మర్చిపోలేం అన్నారు.
పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం పై ఫిర్యాదులపై కేసులు పెడితే కేసీఆర్ కి చిత్తశుద్ది ఉన్నట్టు తెలుస్తుందన్నారు రేవంత్. కేసులు పెట్టకపోతే కేసీఆర్ నిజస్వరూపం బయట పడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దూరంగా వున్నారు.
సోనియా గాంధీ కుటుంబాన్ని అవమానించడాన్ని పీఏసీ ఖండించింది. అస్సాం సీఎంని వెంటనే తొలగించాలని, చర్య తీసుకోకపోతే బీజేపీ అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్డించినట్టు అవుతుందన్నారు. పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు షబ్బీర్ అలీ. 16 న పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేపడతామన్నారు. 18 న మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు లు చేయాలని పీఏసీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. ఇప్పటివరకూ 32 లక్షల టార్గెట్ పూర్తి చేశామని, దీన్ని 50 లక్షల వరకు తీసుకెళ్లాలి అని నిర్ణయించారు.
మోడీ తెలంగాణ పై చేసిన కామెంట్స్ చూస్తే ఆయనకు చరిత్ర తెలియదు అని అర్థమైందన్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం గా ఉండేది . 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాని తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దాన్ని మేము మెర్జర్ అంటాం. తర్వాత మమ్మల్ని విడదీయాలన్నాం. ఎవరికీ అన్యాయం జరగకుండా విభజన జరిగింది. పార్లమెంట్ తలుపులు .. ఓటింగ్ సమయంలో మూస్తారు. మోడీకి పార్లమెంట్ గురించి తెలియక అలా మాట్లాడారు. 370 ఆర్టికిల్ రద్దు చేసినట్టు తెలంగాణని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలుపుతారేమో అని భయంగా వుందన్నారు చిన్నారెడ్డి.