తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రతిపక్షాలు గజగజ వణకాల్సిందే. ఆయన ప్రజల మనిషని, ప్రజలకై పోరాడతారనేది తెలంగాణ ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో.. ప్రజల తరపున కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు.
ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది. pic.twitter.com/59DzXVQziB
— Telangana Congress (@INCTelangana) May 6, 2022
మీరు అనుసరిస్తున్న వారెవరూ అనుసరించలేదు, మీరు @KTRTRSని అనుసరించకుండా మరియు @KTRTRS యొక్క ట్వీట్లను చూడకుండా నిరోధించబడ్డారంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రశ్నను చూసి తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ లో సమాధానం ఇవ్వక పోగా..ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కేటీఆర్ మానసిక స్థితికి ఇది అద్దం పడుతోందని చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ టూర్ సందర్భంగా రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. శతాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ రాహుల్ టూర్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Madhu Yashki Goud : సిగ్గు, శరం ఉందా హరీష్ రావుకు..