కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో సందడి చేశారు. తనదైన రీతిలో అందరితో కలిసిపోయారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. ప్రోటోకాల్ వద్దంటున్నా రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్.. అక్కడి బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
गोवा में आप सब से मिलकर अच्छा लगा। आपकी आँखों में इस सरकार के लिए बहुत ग़ुस्सा है लेकिन एक नए-बेहतर कल की आशा भी।
— Rahul Gandhi (@RahulGandhi) October 30, 2021
मेरे पायलट दोस्त प्रशांत से इस बारे में चर्चा हुई। प्रशांत जैसे लाखों गोवा वासी अब बदलाव चाहते हैं, कांग्रेस चाहते हैं।#GoaWithCongress pic.twitter.com/xv5GnIU4a8
ఆ తర్వాత గోవాలో ‘పైలట్’గా పిలిచే టూవీలర్ ట్యాక్సీ బండిపై లిఫ్ట్ అడిగి ఆజాద్ మైదాన్ వరకు వెళ్లారు. ‘పైలట్’ డ్రైవర్ బైక్ నడుపుతుండగా రాహుల్ వెనక కూర్చుని దాదాపు 5 కిలోమీటర్లు బండిపై ప్రయాణించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2022లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ముందే రాహుల్ ప్రచారం ప్రారంభించారు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఎంతో విలువ, విశ్వసనీయత వున్నాయన్నారు.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని, విశ్వాసంతో కూడిన ఓ గ్యారెంటీ అని రాహుల్ మత్స్యకారులతో అన్నారు.