CM Pinarayi Vijayan: ఇటీవల కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ప్రభుత్వంలో ఉంటుందని, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాషాయ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం త్రివేండ్రం జిల్లా ఎల్డీఎఫ్ ఎన్నికల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్.. పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్…
Bharat Jodo Nyay Yatra: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు కాంగ్రెస్ మరోసారి భారీ కార్యక్రమానికి తెరతీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ మార్చి 17న ముంబైలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతల్ని మల్లికార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల మోడ్‌లో ఉందని, దూకుడుగా ప్రచారం చేస్తామని అన్నారు.
BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు 39 మందితో తొలిజాబితాను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ గురించి కాంగ్రెస్ రహస్యంగా వ్యవహరిస్తోంది. సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
Congress 1st list: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే 195 ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 10 రాష్ట్రాల్లోని కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసిటట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోక్‌సభ జాబితా 39 మంది అభ్యర్థులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్,…
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గుజరాత్ లో పార్టీ ఆశలకు రాహుల్ ఊతం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటన ఇవాళ గోద్రా చేరనుంది.
Rahul Gandhi : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ స్థానం ఖరారు చేశారు. కాంగ్రెస్ తొలి జాబితాలో రాహుల్ గాంధీ పేరు చేరనుంది.
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ తొలి కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో జరగనుంది. 100 నుంచి 125 లోక్‌సభ స్థానాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు యూపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని సీట్లు కొలిక్కి రావచ్చని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరుకానందుకు నిరసనగా ఓ ముఖ్య నేత హస్తం పార్టీని వీడారు.