Kishan Reddy: నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: నాకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీకి పంపండని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఢిల్లీ ఎన్నికలు అన్నారు. ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుంది? ఎవరు ప్రధానమంత్రి అయితే మన గౌరవం పెరుగుతుంది? ఎవరు సమర్థవంతంగా ముందుకు తీసెళ్తారో వాళ్లకు ఓటెయ్యాలని కోరుతున్నాను అన్నారు. స్వాత్యంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని అయ్యే వరకు దేశం ఎలా ఉందో బేరీజు వేసి మోడీకి ఓటెయ్యండి అని కోరారు. అందరూ పోలింగ్ లో పాల్గొనాలి అని కోరారు. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో 40% పోలింగ్ కూడా జరగదన్నారు.
Read also: Tellam Venktrao : కాంగ్రెస్‌లోకి తెల్లం వెంకట్రావ్
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
- OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసే దగ్గర 80% పోలింగ్ అవుతుందన్నారు. ఎవరికి అయిన ఓటెయ్యండి కానీ ఓటు వేయడానికి ముందుకు రండీ అన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడాన్ని ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్లాలన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసినప్పటి నుంచి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని వందల సార్లు చర్చలు చేశారన్నారు. కొత్త పార్లమెంట్ లో మొదటి బిల్లు చట్టసభల్లో మహిళల కోసం ప్రవేశపెట్టామన్నారు. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు మోడీ అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ లేదన్నారు. కాంగ్రెస్ పాలించిన ఈ ఆటవిక సంప్రదాయాన్ని కొనసాగించిందన్నారు. మహిళల మెడలో కత్తిలాగా ట్రిపుల్ తలాక్ వేలాడిందన్నారు.
Read also: Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారు..
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ఇచ్చారన్నారు. నిన్న రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తీసుకొస్తామన్నాడని తెలిపారు. లవ్ జిహాద్ ని కూడా చట్టబద్ధం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పాడని గుర్తు చేశారు. ఓట్ల కోసం ఇంత దిగజారుతారా.? అని మండిపడ్డారు. సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారన్నారు. మహిళల గౌరవాన్ని పెంచడానికి 13 కోట్ల టాయిలెట్స్ నిర్మించారని తెలిపారు. నాకు మనసు పూర్తిగా ఓటేసి.. గెలిపించి.. ఢిల్లీకి పంపాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.
Etela Rajender: దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..?
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?