Kishan Reddy: చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగ భృతికి దిక్కులేదు.. దేశం గురించి మాట్లాడుతున్నారన్నారు. మోడీ హయాంలో 25 కోట్లమంది పేదరికం నుండి బయటపడ్డారని వివిధ సంస్థలు చెప్పినా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు.. తెలంగాణలో చేయకుండా దేశంలో ఉద్దరిస్తారా అంటూ ప్రశ్నించారు. కనీస మద్దతు ధర పెంచింది ఎవరని ఆయన ప్రశ్నలు గుప్పించారు. కనీస వేతనం 12 వేల నుండి 18 వేలకు పెంచింది మోడీ అని ఆయన తెలిపారు. మీ నాయనమ్మ, మీ తాత హయాంలోనే కదా కంపెనీలు పెట్టింది.. ఎప్పుడూ అధికారంలో ఉన్నప్పుడు దళితులు గుర్తుకు రాలేదా అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు.
Read Also: Revanth Reddy: ఎలా పడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతాం..
మేము ముద్ర రుణాలు అన్ని వర్గాలకు ఇస్తున్నాం.. ఎస్సీ ఎస్టీ మహిళలు ఉండాలని బ్యాంక్‌లను అదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్‌లు బీసీలు లేకపోవడానికి కారణం మీరేనని ఆయన వ్యాఖ్యానించారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐఏఎస్‌లు అయిన వారే ఇప్పుడు సెక్రటరీలు అయ్యారన్నారు. బీసీ ప్రధానిని చేసింది బీజేపీనేనని తెలిపారు. జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజు అయిన బీసీని ముఖ్యమంత్రి నీ చేశారా అని అడిగిన కిషన్ రెడ్డి.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వస్తువులను ఇక్కడ ఉన్న వారికి అన్యాయం చేసి ఇతర దేశాల నుంచి దిగుమతి చేశారని ఆయన పేర్కొన్నారు. చైనా లాంటి బ్రాండ్ వస్తువులు ఇక్కడకు వస్తాయి అంటున్న రాహుల్ గాంధీ ఆ బ్రాండ్‌లు బాగుంటాయని అంటున్నారా.. అవి ఇక్కడకు వస్తాయని అంటున్నారా… చెప్పాలన్నారు. చైనాను పొగుడుతున్నారు.. ఆయనకు కొద్దిగా కూడా బుద్ది లేదన్నారు.
Read Also: Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్
ఎవరి కి ఎవరు బీ టీమో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పంపించి ఆదుకుందన్నారు. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పంపి కాంగ్రెస్ ప్రభుత్వంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ పంపించిందన్నారు. కేసీఆర్ ఎవరు ఒకప్పుడు కాంగ్రెస్ వ్యక్తి… కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకున్న వ్యక్తి… పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేస్తా అన్న వ్యక్తి…. చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగాడన్నారు. మేం ఎప్పుడూ ఆ పార్టీతో కలిసి తిరగలేదన్నారు. దేశంలో పత్రిక స్వేచ్ఛను హరించి రాజ్యాంగాన్ని రద్దు చేసింది మీ నాయనమ్మ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో నోట్లు ముద్రించి యంత్రాలు పెట్టుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. పనికిరాని మాటలు మాట్లాడుతున్నారన్నారు.
ప్రజల్ని మోసం చేసే హామీలే
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక నిమిషం కూడా ఆలోచించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ కుటుంబ హక్కులు తప్ప ఎవరీ హక్కులు ఉండవు. ఎవరి ఫోన్లు ట్యాప్‌లు చేశారో నిరూపించాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఫోన్ ట్యాపింగ్ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేశారు.. చర్యలు తీసుకోలేదు.. మేము కూడా చేసాము చర్యలు తీసుకున్నాం.. దేశం కోసం మేము ఏమైనా చేస్తాం. గాంధీ పరివార్‌కి మోడీ పరివార్‌కు మధ్య పోరాటమే. రాజ్యాంగ వ్యవస్థల మీద కాంగ్రెస్ కుట్ర పూరితంగా దాడి చేస్తుంది.” అని తెలిపారు.