ఆదివారం ముంబై వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత అమ్మ సోనియాను కలిసి కన్నీటిపర్యంతం అయ్యారని..
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.
Bharat Jodo Nyay Yatra: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్,…
ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి ‘బ్రెయిన్‌చైల్డ్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. తన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' చివరి దశలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని పేర్కొన్నారు.
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం…
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందువుల్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, చట్టాలను తీసుకువచ్చిందని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చని సూచించారు.