నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీ.. కొత్త చట్టం తీసుకొస్తాం..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల్లో మండల స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తేపై కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓంకార్‌సింగ్ మార్కమ్‌ను బరిలోకి దింపింది. ఈ క్రమంలో.. సియోని జిల్లాలోని ధనోరాలో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు గ్యారెంటీ అప్రెంటీస్‌షిప్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో మూడు నాలుగు విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు, వెనుకబడిన తరగతులు, పేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాలకు లక్ష రూపాయలను బదిలీ చేయడం వంటివి. ఈ విధంగా తాము ప్రతి నెలా మీ ఖాతాలకు వేల రూపాయలు పంపుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు చెల్లించే మొత్తాన్ని రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో ఉంచామని రాహుల్ గాంధీ చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
గర్జియా మాత ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం
ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలోప ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది.
కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మండల వారీగా నేతలతో సమీక్ష
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్‌నగర్ పరిధిలోనే ఉండటంతో.. కొడంగల్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ తీసుకురావడంపై దృష్టి సారించారు. సోమవారం (ఏఫ్రిల్ 8) మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యుహాలపై దిశానిర్ధేశం చేశారు.
బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి కాటసాని, చల్లా కుటుంబ సభ్యులు..
నంద్యాల జిల్లాలోనే మోస్ట పొలిటికల్ హాటెస్ట్ సెంటర్ బనగానపల్లె నియోజకవర్గం. అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ప్రతిపక్ష టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మధ్య ఎత్తులకు పై ఎత్తులు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో బనగానపల్లె రాజకీయం రోజురోజుకు మండే ఎండలను మించి హీటెక్కిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో బీసీపై స్వల్ఫ తేడాతో గెలిచి కాటసాని పై చేయి సాధించగా.. ఈసారి కాటసాని రామిరెడ్డిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బీసీ జనార్థన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అంతే కాదు కాటసాని బంధువులను టీడీపీలో చేర్చుకుని తన సొంత ఇలాకా అవుకులో క్యాడర్ ను ఖాళీ చేసే పనిలో పడ్డారు. అటు చల్లా వర్గీయులు, ఇటు కాటసాని కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నారు.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్ట్‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేవిధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని ఆమె అధికారులను ఆదేశించారు. MD MRDCL ఆమ్రపాలి ప్రాజెక్ట్ అంశాలను సమావేశంలో పాల్గొన్న అధికారులకు వివరించారు. ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల DPRలు, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ మొదలైన విభాగాలకు ఈ సమావేశంలో టైమ్‌లైన్‌లు నిర్ణయించబడ్డాయి.
మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
గతేడాది మణిపూర్ అల్లర్లతో అట్టుడికింది. ఆయా వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లే మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దబడిందని ప్రధాని మోడీ తెలిపారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొందని చెప్పారు. మణిపూర్‌లో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు..
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు. జోగి రమేష్ నువ్వు స్వయం కృషిపై మంత్రి అయ్యావా అని ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడా మీకు కళ్ళు కనిపించట్లేదు.. అందరూ కూడా నిన్ను గూర్క అని పిలిచేది అందుకే అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా పని చేశారన్నారు. మేము చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాము.. నీకు నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నాడు.. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు అది గుర్తుంచుకో అని బొడే ప్రసాద్ తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలి
సిద్దిపేటకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సిద్దిపేట యువతకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) యువజన విభాగం సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటకు మాజీ ముఖ్యమంత్రి మంజూరు చేసిన ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను తీసుకోవడమే కాకుండా రూ.150 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి కే చంద్రశేఖర్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట ప్రజలను ఎలా మోసం చేస్తుందో చైతన్యం చేసి ఇతర ఓటర్లకు దారి చూపాలని సిద్దిపేట యువతకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోవడంలో రేవంత్ విఫలమయ్యారన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా ముఖ్యమైన సాధనంగా మారినందున, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రావు యువ నాయకులకు పిలుపునిచ్చారు.
ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు..
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. గత వారం రోజుల క్రితం ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులను ఈసీ జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా, ఏపీలో ట్రాన్సఫర్లు అయినా ఐఏఎస్ అధికారులకు పోస్టింగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు జవహార్ రెడ్డి జీవో జారీ చేశారు.