కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
Read Also: Health Tips : రాత్రి పడుకోనే ముందు ఒక గ్లాసు తాగితే చాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
ఈ అంశానికి సంబంధించి.. రాహుల్ గాంధీ బుధవారం ‘X’లో హిందీలో పోస్ట్ చేస్తూ, ‘ఎవరు దేశభక్తుడో, ఎవరు ద్రోహం చేశారో చరిత్రే సాక్షి’ అని అన్నారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని అన్నారు. ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్.. మరోవైపు ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్న వారి మధ్య అని పేర్కొన్నారు. దేశాన్ని విభజించిన శక్తులతో ఎవరు చేతులు కలిపారు, దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం ఎవరు పోరాడారో చరిత్రే సాక్షి అని తెలిపారు.
Read Also: AAP: మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఎప్పుడంటే..?
క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరు నిలిచారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారతీయ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు దేశాన్ని విభజించిన శక్తులతో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు నడిపారు?’ అని ఆయన అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే మాటల దాడులకు దిగడంతో రాహుల్ గాంధీ ఈ విధంగా ఎదురుదాడికి దిగారు. రాజకీయ వేదికలపై నుంచి ‘అసత్యాలు వల్లె వేయడం’ ద్వారా చరిత్ర మారదని రాహుల్ అన్నారు.