అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు…
సార్వత్రిక ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు.
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు.
నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు.…
BJP: కేరళ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కే. సురేంద్రన్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలకు దిగారు. అటవీ ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో..
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధిష్ఠానం లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు భారత కూటమికి పెద్ద దెబ్బగా రుజువు చేస్తుందా లేదా ప్రతిపక్ష శిబిరాన్ని బలోపేతం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.
'Shakti' remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు.