Rahul Gandhi: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీకి, అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. రాహుల్ వ్యాఖ్యల్ని అధికార పక్షం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బిజెపి ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విదేశాంగ విధానానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయవద్దని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికాకు పంపాల్సి అసవరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. “మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు పొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకుడు అంత తీవ్రమైన, ఆధారాలు లేని ప్రకటనలు చేయవద్దు. ఇది రెండు దేశాల సంబంధాలకు సంబంధించిన విషయం. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే, విదేశాంగ మంత్రి ఏ ప్రయోజనాల కోసం అమెరికా వెళ్లారో చెప్పాలని సవాల్ చేశారు. రాహుల్ గాంధీ చైనా అంశాన్ని లేవనెత్తుతూ.. లడఖ్‌లో చైనా సైన్యం చొరబాటు గురించి ప్రధాని చేసిన వాదనలకి విరుద్ధంగా భారత సైన్యం వాదలు ఉన్నాయనడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడే మాటలకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.