Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యూపీలోని బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలని పేర్కొనింది.
రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు.
Parliament 'assault' case: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.
పార్లమెంట్లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని…
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు.
Jagga Reddy: బీజేపీ వాళ్లు దేవుడిని మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కి రాహుల్ గాంధీ కి తేడా ఉందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను అతుల్ సుభాష్ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు.